ఋణ విమోచన నృసింహ స్తోత్రం
సగం మనిషి సగం సింహం రూపము కలగలిసిన ఒక అరుదైన అవతారం శ్రీ నృసింహ అవతారం. నరసింహ స్వామి యొక్క రూపం చూడడానికి అతి భయంకరంగా ఉన్నప్పటికీ తన భక్తులపట్ల ఆయన ఎంతో శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు.
తీవ్రమైన అప్పుల బాధలు లేదా ఆర్థిక సమస్యలతో బాధపడే వారు ఇప్పుడు నేను చెప్పబోయే నృసింహస్వామి స్తోత్రాన్ని పఠించినట్లయితే వారి అప్పుల బాధలు తొలగిపోతాయని ఎందరో అనుభవపూర్వకంగా నిరూపించారు.
ఈ స్తోత్రాన్ని 21 రోజుల పాటు త్రిసంధ్యలలో ను లేదా 41 రోజుల పాటు ప్రదోష కాలం లోనూ పఠించినట్లయితే వారి సమస్యలన్నిటిని శ్రీ నృసింహ స్వామి తీరుస్తాడని నమ్మకం.
ఇంకొక ముఖ్య విశేషమేమిటంటే శ్రీ నృసింహ స్వామిని పూజించే వారు తాము చేసే పూజలో కానీ చదివే మంత్రాలలో కానీ ఏవైనా లోపాలు జరిగినప్పటికీ ఆ స్వామి ఆ తప్పులను క్షమించి తన భక్తులను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని నమ్మకం.
ఈ స్తోత్రాన్ని శ్రీ నృసింహ పురాణం అనే ఉప పురాణం నుంచి తీసుకోవడం జరిగింది. దీనిని రుణ విమోచన నృసింహ స్తోత్రం అంటారు.
కాబట్టి మీరందరూ ఈ స్తోత్రాన్ని పఠించి ఆ స్వామి యొక్క కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాను.
దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౧ ||
లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౨ ||
ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౩ ||
స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౪ ||
సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౫ ||
ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౬ ||
వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౭ ||
క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౮ ||
య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ | అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ || ౯ ||