సంకష్టనాశన గణపతి స్తోత్రం
మనం ఏ పనైనా మొదలు పెట్టడానికి ముందు మొదటి పూజ విఘ్నేశ్వరునికి చేస్తాము ఎందుకంటే మనం చేసే ఏ పనైనా అవిఘ్నంగా కొనసాగాలని ఆయనకు పూజ చేసి మనం పని మొదలుపెడతాం
ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు చేతులతో చంద్రునివలె కాలస్వరూపు డై ప్రసన్నమైన శబ్దబ్రహ్మమై సృష్టిని పరిపాలిస్తున్న సకల గణాధిపతి ఈ వినాయకుడు. అటువంటి మహత్తర శక్తి గల వినాయకుడి ఒక స్తోత్రం మనల్ని అన్ని కష్టాల నుంచి బయటపడేస్తుంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బిజినెస్ లావాదేవీలలో గాని పెళ్లి తర్వాత వచ్చేటటువంటి సమస్యలలో గాని ప్రేమ విషయాల్లో గాని ఉద్యోగ విషయాల్లో గాని ఉన్న ముఖ్యమైన సమస్యలు తీరాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్తోత్రాన్ని త్రిసంధ్యలలో అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 21 రోజులపాటు కానీ 41 రోజుల పాటు కానీ పఠించినట్లయితే కచ్చితంగా ఆ సమస్య నుండి మనల్ని ఆ గణపతి కాపాడుతాడని ప్రతీతి.
ఈ స్తోత్రం ఈ రోజు మననం చేసుకోవడం వలన మనకున్న అన్ని కష్టాలు తీరుతాయని అంటారు. మీరందరూ ఈ స్తోత్రాన్ని సవ్యంగా పఠించి సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను.
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || ౧ ||
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || ౨ ||
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || ౩ ||
నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || ౪ ||
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || ౫ ||
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || ౬ ||
జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || ౭ ||
అష్టానాం బ్రాహ్మణానాం చ లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || ౮ ||
క్రింది వీడియో లో ఈ స్త్రోత్రం ఎలా పఠించాలో చూడండి