తిరుమల శ్రీవారి ఒరిజినల్ వీడియో

స్వామి వారి మూల మూర్తి

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన కొలువైన టువంటి తిరుమల పరమ పావనమైనది. మనకందరికీ ముక్తిని ప్రసాదించేది. తిరుమల శ్రీవారి దర్శనం ఇప్పుడు అత్యంత దుర్లభమైన ఎందుకంటే రోజు శ్రీవారిని దర్శించుకునే భక్తులు కొన్ని వేలల్లోఉన్నారు.

అంత మంది భక్తులను దర్శనానికి అనుమతించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అనేక ఏర్పాట్లు చేసింది .అయినప్పటికీ చాలా దూరం నుంచి కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఆయనను దర్శించుకోడానికి కుదురుతుంది .

నేను ఇంటర్నెట్ లో అనేక వీడియోలు చూశాను శ్రీవారి మూలమూర్తి అని ఒరిజినల్ వెంకటేశ్వర స్వామి అని అవన్నీ కూడా దాదాపుగా ఫేక్ అని చెప్పవచ్చు ఎందుకంటే లోపలికి ఎటువంటి కెమెరాలను కానీ అనుమతించరు అంతేకాదు దేవస్థానం కూడా ఫోటో తీయదు అందువలన శ్రీవారి మూలమూర్తి ఒరిజినల్ గా వీడియో చూడటం అనేది చాలా కష్టం

కానీ 1980లో దేవస్థానం వారు శ్రీ వేంకటేశ్వర వైభవం అని ఒక సినిమా రిలీజ్ చేయడం జరిగింది ఇది ఒక డాక్యుమెంటరీ ఇందులో మూలమూర్తి వీడియో తీయడం జరిగింది అది కేవలం వీడియో కేసెట్ల రూపంలో లభ్యమవుతుంది ఇప్పుడు దాదాపు అన్ని వీడియో క్యాసెట్ లను దేవస్థానం దగ్ధం చేసిందని అంటారు

ఇప్పుడు కూడా శ్రీ వెంకటేశ్వర వైభవం అనే విసిడి లు దొరుకుతున్నాయి అయితే అందులో మూలమూర్తి ఉండేటటువంటి వీడియోని తిరుమల దేవస్థానం వారు తయారుచేసిన నకలు దేవస్థానం లో చిత్రీకరించారు

అత్యంత కష్టం పైన ఈ వీడియో క్యాసెట్ ని నేను సంపాదించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి మూలమూర్తి వీడియో నేను డిజిటల్ గా మార్చి యూట్యూబ్ లో ఉంచాను. దాని లింక్ ఇక్కడ కింద ఇవ్వబడింది కాబట్టి అందరూ స్వామివారి దర్శనాన్ని చేసుకుంటారని చేసుకొని తరిస్తారని ఆశిస్తున్నాను.